గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ లో ఏమో కానీ సినిమాల్లో మాత్రం తన క్రేజ్ గాని తన మేనియా గాని వేరే స్థాయిలో ఉంటుంది. అలా నిన్న రిలీజ్ చేసిన “ఉస్తాద్ భగత్ సింగ్” గ్లింప్స్ కి అభిమానులు మాసివ్ రెస్పాన్స్ అయితే అందిస్తున్నారు.
కాగా పవన్ ఫిలిం కెరీర్ లో అయితే ఏదన్నా రిమార్క్ ఉంది అంటే అది ఈ టైం లో కూడా రీమేక్ సినిమాలను ఎంచుకోవడం అని అంటారు అభిమానులు. అయితే ఇప్పుడు అలా చేస్తున్న రెండు రీమేక్ సినిమాలు చేస్తుండగా వాటిలో దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి.
లాస్ట్ టైం వీరి నుంచి వచ్చిన గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ హిట్ కాగా ఇప్పుడు ఉస్తాద్ విషయంలో ఫ్యాన్స్ అయితే కాస్త కంగారు గానే ఉన్నారు. నిన్న గ్లింప్స్ రాకముందు వరకు కూడా ఆ తేరి రీమేక్ తో మమ్మల్ని చావగొడతాడు అనుకుంటే హరీష్ శంకర్ మాత్రం సర్ప్రైజ్ ని అందించారు.
అసలు తేరి తో సంబంధమే లేకుండా ఉన్న ఈ గ్లింప్స్ తో అయితే ఎక్కడ రీమేక్ లా ఉంటుందా అని అనుకున్న వారి అంచనాలు అన్నిటినీ కూడా హరీష్ శంకర్ తలకిందులు చేసాడని చెప్పొచ్చు. దీనితో అయితే ఇప్పుడు మరింత పాజిటివ్ రెస్పాన్స్ ఫ్యాన్స్ లో అయితే ఈ సినిమా పరంగా పెరిగింది. నిన్న ట్రోల్స్ కూడా లెక్క చేయకుండా తన వర్క్ పై నమ్మకం ఉంచుకొని హరీష్ శంకర్ ఫ్యాన్స్ రావడం మరో విశేషం.