“ఉస్తాద్ భగత్ సింగ్” పై సూపర్ అప్డేట్ ఇచ్చిన హరీష్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు ఫుల్ బిజీగా ఒకో సినిమా కంప్లీట్ చేస్తున్నారు. ఆల్రెడీ దర్శకుడు సముద్రఖని తో ఓ రీమేక్ సినిమాలో తన పోర్షన్ ని కంప్లీట్ చేసిన పవన్ నెక్స్ట్ అయితే దర్శకుడు హరీష్ శంకర్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సాలిడ్ పోలీస్ డ్రామా చేస్తున్నాడు.

మరి ఈ సినిమా ప్రీ లుక్ లో గబ్బర్ సింగ్ వైబ్స్ తెచ్చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చే సినిమాలా అయితే దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అయితే శ్రీ లీల లాక్ అయ్యినట్టుగా రీసెంట్ గా మేకర్స్ అధికారిక క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ కోసం హరీష్ శంకర్ సూపర్ అప్డేట్ ఇచ్చాడు. ఫ్యాన్స్ ఈ సినిమాలో పవన్ మరియు ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీ లీల తో ఓ మాస్ స్టెప్ ఉండే సాంగ్ కావాలని కోరుకోగా హరీష్ శంకర్ అయితే దీనికి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి  తప్పకుండా ఇది ఉంటుంది అన్నట్టు రిప్లై ఇచ్చాడు.

దీనితో అయితే మళ్ళీ గబ్బర్ సింగ్ లో చూసిన పవన్ ని మనం చూడొచ్చని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వీలైనంత త్వరగా ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ కి ఈ  సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు టాక్.