గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తో చేయనున్న ప్రాజెక్ట్ “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటని తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కావాల్సి ఉండగా ప్రస్తుతం సినిమా భారీ సెట్ వర్క్ లు ఇతర నటీ నటుల ఎంపిక అయితే జరుగుతున్నాయి.
కాగా ఈ సినిమాని మొదటగా “భవదీయుడు భగత్ సింగ్” అంటూ అనౌన్స్ చేసి దానిని కాస్తా నెక్స్ట్ రీమేక్ గా “ఉస్తాద్ భగత్ సింగ్” అంటూ రీ అనౌన్సమెంట్ చేశారు. అయితే అక్కడ నుంచి దర్శకుడు పై మరింత నెగిటివిటీ వచ్చిందో తెలిసిందే. కాగా అక్కడ చాలా సీరియస్ అయ్యిపోయిన హరీష్ శంకర్ లేటెస్ట్ గా సరికొత్త పుకార్ల పై అయితే స్పందించాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఒరిజినల్ అయ్యినటువంటి తేరి లో మార్పులు చేస్తూ వచ్చిన రూమర్స్ పై తాను మాట్లాడుతు ఇవన్నీ అవాస్తవం అని తెలిపాడు. అంతే కాకుండా నేను ట్విట్టర్ లో ఎప్పుడూ కూడా యాక్టీవ్ గా ఉంటాను కాబట్టి ఒకసారి నన్ను ఇలా పోస్ట్ లు వేసే ముందు అడగండి అంటూ తెలిపాడు.
దీనితో ఈ సినిమా పై వచ్చిన ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని అయితే హరీష్ క్లారిటీ ఇచ్చాడని చెప్పాలి. కాగా ఈ సినిమా షూటింగ్ అయితే మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.
Not True Sir.
As u know am active in twitter you could have asked me before posting; https://t.co/srC4zkpGWK— Harish Shankar .S (@harish2you) March 14, 2023