వైరల్ : “ఉస్తాద్” పై ఫన్నీ పోస్ట్ పెట్టిన హరీష్ శంకర్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో తన సెన్సేషనల్ హిట్ కాంబినేషన్ గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన మాసివ్ ఏక్షన్ ఎంటర్టైనర్ సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి.

మరి ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పై ఓ అధికారిక క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని రోజులు నుంచి అయితే ఈ సినిమా షూటింగ్ అందులోని పవన్ పాల్గొనే ఎపిసోడ్ అన్నట్టుగా ఈ ఏప్రిల్ 5 నుంచే స్టార్ట్ అయ్యింది.

ఇక ఈ టాక్ ని నిజం చేస్తూ ఈ అవైటెడ్ సినిమా షూటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యిపోయింది. పైగా దీనిని దర్శకుడు హరీష్ శంకర్ కన్ఫర్మ్ చెయ్యడం విశేషం. కాగా దీనిపై హరీష్ శంకర్ ఎగ్జైట్మెంట్ అంతటినీ కూడా ఓ పోస్ట్ లో పెట్టి షేర్ చేయడం మరింత వైరల్ గా మారింది.

పాత సినీ పాట ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే నిజమవుతుందే అంటూ చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేస్తున్న ఆనందాన్ని ఈ రకంగా వ్యక్తం చేసాడు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో అయితే శ్రీ లీల హీరోయిన్ గా లాక్ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. 
https://twitter.com/harish2you/status/1643463011775184896