బిగ్ బాస్ హౌస్‌లో డ్రెస్సింగ్.. నోరు విప్పిన హారిక

Harika about Her Dressing In Bigg Boss 4 Telugu

బిగ్ బాస్ షోలో ఎలా నడిచినా ఎంత హైప్ వచ్చినా కూడా ప్రేక్షకుల్లో కొన్ని అనుమానాలు ఉండనే ఉంటాయి. అదంతా స్క్రిప్ట్డ్ షో అని, కంటెస్టెంట్లకు ముందే అలా చేయమని ఇలా చేయమని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటారని జనాలు నమ్ముతుంటారు. కొందరినీ లవ్ ట్రాకుల కోసమే తీసుకుంటారని ఇంకొందరు ఎక్స్‌పోజింగ్ కోసమే తీసుకుంటారని అనుకుంటారు. దానికి తగ్గట్టే కొందరు అలానే ప్రవర్తిస్తుంటారు. ఇంట్లో ప్రేమాయణం సాగిస్తూ.. అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుంటారు.

Harika about Her Dressing In Bigg Boss 4 Telugu
Harika about Her Dressing In Bigg Boss 4 Telugu

నాల్గో సీజన్‌లో ఇదే విషయంలో మోనాల్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమెను ముందే సూచనలు వెళ్లాయని, అందుకే ఎవరోకరితో ట్రాకు నడుపుతూనే ఉందని అందరూ అంటున్నారు. పైగా డ్రెస్సింగ్‌లోనూ మోనాల్ శ్రుతి మించేది. ఎద అందాలు బయటకు కనిపించేలా దుస్తులు ధరించేది. ఇక హారిక కూడా పొట్టి పొట్టి బట్టలనే వేసుకుని యూత్ ఆడియెన్స్‌కు పిచ్చెక్కించేది. ఎప్పుడూ కూడా నిండుగా బట్టలు ధరించినట్టు ఎక్కడా కూడా కనిపించలేదు.

ఆమెను కూడా ఎక్స్‌పోజింగ్ క్యాటగిరీలోనే తీసుకున్నారని టాక్ బాగా వైరల్ అయింది. దీనిపై తాజాగా హారిక లైవ్‌లోకి వచ్చిన క్లారిటీ ఇచ్చింది. తనకు బిగ్ బాస్ టీం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని, ఇలాంటి బట్టలు వేసుకోవాలని ఏమీ చెప్పలేదని తనకు నచ్చినవే వేసుకున్నానని చెప్పుకొచ్చింది. అందులో బిగ్ బాస్ టీం చేసిందేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి తన దుస్తులు, ఆహార్యంపై చర్చ జరుగుతోందని మాత్రం హారిక తెలుసుకున్నట్టుంది.