Harika: నడుము తిప్పుతూ కన్ను కొడుతూ పిలుస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ హారిక!

Harika: ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రంలోని సమంత ఐటమ్ సాంగ్ లో నటించిందన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పాటకు సమంత అదిరిపోయే స్టెప్పులు వేయడంతో ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉ అంటావా మామ… ఊ ఊ అంటావా మావా అంటూ సమంత రెచ్చిపోయి ఈ పాటకు డాన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఈ పాట సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ఈ పాటకు ఎంతోమంది డాన్స్ చేస్తూ ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితం బిగ్ బాస్ బ్యూటీ అరియానా ఈ పాటకు అద్భుతమైన డాన్స్ వేసి తన ఇంస్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త బాగా వైరల్ అయింది. ఈ క్రమంలోనే మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ దేత్తడి హారిక కూడా ఈ పాటకు డాన్స్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

ఇందులో భాగంగా దేత్తడి హారిక నడుము ఊపుతూ కన్నుకొడుతూ ఈ పాటకు వేసిన స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు… సమంత బదులు ఈ పాటలో నువ్వు డాన్స్ చేసి ఉంటే ఇంకాస్త అద్భుతంగా ఉండేది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఈ వీడియో సాంగ్ చేయొచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు… మరికొందరు మాత్రం సూపర్ అంటూ కామెంట్లు పెట్టడం విశేషం.