Pavan kalyan : కొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న పవన్… హరి హర వీరమల్లు టీం నుండి మరో సర్ ప్రైజ్….!

Pavan Kalyan : పవన్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఎపుడో మొదలైన కరోనా కారణంగా ఆగిపోయింది. ఇక పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ లో జాప్యం జరిగింది. ఇక ఇపుడు పవన్ ఈ సినిమా పూర్తి చేయాలనీ డిసైడ్ అయినట్టున్నారు. ఎక్కువ రోజులు షూటింగ్ కోసం కేటాయించి కంప్లీట్ చేయబోతున్నారు. ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఒక పీరియడిక్ డ్రామా గా తెరకెక్కుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, ఆ తర్వాత భీమ్లా నాయక్ అంటూ వరుస విజయాలు అందుకున్నారు. అటు రాజకీయలు ఇటు సినిమాలు అంటూ రెండు పడవలపై పయనం చేస్తున్న పవన్ ఈమధ్య వత్తిడికి లోనవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల సమయానికి ఒప్పుకున్న సినిమాలు చేసేసి ఆ సమయానికి రాజకీయంగా బిజీ అవ్వాలని పవన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఇక హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎక్కువ డేస్ ను సినిమా కోసం కేటాయించారట పవన్. ఇక సినిమా నుండి విడుదలైన కత్తిసాము చేస్తున్న వీడియో బాగా వైరల్ అయింది.ఇక ఇపుడు శ్రీ రామ నవమి సందర్బంగా టీజర్ ను విడుదల చేసి అభిమానులకు డబుల్ సర్ ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతొంది. దీంతో ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా హరి హర వీర మల్లు లోకేషన్‌లో పూజ నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా, షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు లొకేషన్ లో పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నం సీతారాములకు భక్తి శ్రద్ధలతో పూజ చేశారు.