Ustad Bhagat Singh: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలు, మరొకవైపు రాజకీయాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు పవన్. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఓజీ మూవీ కూడా ఒకటి. ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రాబోతోంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతోంది. కాగా ఇందులో శ్రీలీలే హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే పవన్ చివరి సినిమా అవ్వొచ్చేమో అని కూడా భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకాస్త బ్యాలెన్స్ ఉంది. అయితే నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో నిన్ననే పవన్ ఫ్యాన్స్ కోసం హరీష్ శంకర్ స్పెషల్ గిఫ్ట్ రిలీజ్ చేసారు.
https://twitter.com/MythriOfficial/status/1962474165598130545?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1962474165598130545%7Ctwgr%5Ee704cb74fa1ef6872ff011ae6d0bc15aa47652bc%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fpawan-kalyan-ustaad-bhagat-singh-new-poster-released-sy-985575.html
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లోని ఒక సాంగ్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త స్టిల్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ మైకేల్ జాక్సన్ లుక్ లో స్టైలిష్ గా కనిపించారు. ఇటీవల నిర్మాత SKN ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ షూట్ లో పవన్ కళ్యాణ్ అదిరిపోయే డ్యాన్స్ వేశారు, ఫ్యాన్స్ కి అది పండగే అని ట్వీట్ చేసారు. ప్రస్తుతం హరీష్ శంకర్చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
