Rashmika: మహారాణి ఏసు బాయిగా రష్మిక…. ఆకట్టుకుంటున్న పోస్టర్…. మరో హిట్ గ్యారెంటీ?

Rashmika: సినీనటి రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఇప్పటికే పలు పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న రష్మిక ఇటీవల పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం ఈమె ది గర్ల్ ఫ్రెండ్, కుబేర, సికిందర్ వంటి సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న రష్మిక మరో బాలీవుడ్ సినిమాకి కమిట్ అయ్యారని తెలుస్తోంది.బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ ఛావా. ఇందులో రష్మిక యేసు బాయి పాత్రలో నటించారు. తాజాగా రష్మికకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు విడుదల చేయడంతో ఈ పోస్టర్ కాస్త వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే రష్మిక సైతం తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఒక ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె… ప్రతి గొప్ప మహారాజు వెనుక బలమైన మహారాణి ఉంటుంది.స్వరాజ్యానికి గర్వకారణమైన యేసు బాయిని మీకు పరిచయం చేస్తున్నాం అని రష్మిక ట్వీట్ చేశారు. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇలా రష్మిక ఏసు భాయి పాత్రలో ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్నారు ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటేనే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. జనవరి 22వ తేదీ ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేస్తున్న నేపథ్యంలో తాజాగా రష్మికకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక పుష్ప 2 తర్వాత రష్మికకు మరోసారి ఈ సినిమా ద్వారా బ్లాక్ బాస్టర్ హిట్ గ్యారెంటీ అని తెలుస్తుంది. ఇక ప్రస్తుతమైతే ఈమె వరస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.