Balakrishna : ఉగాది రోజున సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసిన బాలయ్య… ఫ్యాన్స్ కు నిజమైన పండగ…!

Balakrishna: బాలయ్య బాబు అఖండ సినిమా థియేటర్స్ తోపాటు సినిమా అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చారు.ఇక ఓటిటి లో అడుగు పెట్టి చరిత్ర తిరగరాశారు. ఆహా ఒరిజినల్స్ లో వచ్చిన అన్ స్టాపబుల్ తో టి ఆర్ పి లెక్క మార్చేశారు. సీజన్ 1 ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి రెండో సీజన్ కోసం సిద్ధంవుతున్నారు .ఇక NBK @107ను మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయబోతున్నారు అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. క్రాక్ సినిమా హిట్ తర్వాత గోపీచంద్ మలినేని తీయబోతున్న ఫిల్మ్ కావడం తో అంచనాలు పెరిగాయి.ఇక ఈ సినిమా నుండి బాలయ్య బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాక రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక ఇపుడు ఇంకో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటికి వచ్చింది.

ఉగాది రోజున బాలయ్య 107 మూవీ నుండి అదిరిపోయే గిఫ్ట్ రాబోతున్నట్లు సమాచారం. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటె ఉగాది పండగ సందర్భంగా బాలయ్య అభిమానులను ఖుష్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను ఉగాది సందర్భగా రిలీజ్ చేయనున్నారట.. టైటిల్ ను సైతం ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సిరిసిల్ల ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారని టాక్.

ఇకపోతే ఈ సినిమాను కంటిన్యూగా షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే దసరాకే బాలయ్య సినిమా అంటే అఖండ వచ్చిన యేడాదిలోపే మరో సినిమాతో ఆయన అభిమానులకు మాంచి విందు ఇవ్వనున్నాడన్న మాట. ఇక బాలయ్య స్టైల్లో ఫుల్ మాస్ జాతర కావడంతో మరోసారి థియేటర్లు మాస్ మానియాతో ఊగిపోనున్నాయి.