సెన్సేషనల్ రిపోర్ట్స్ తో స్టార్ట్ అయ్యిన “హనుమాన్”.!

చాలా కాలం నుంచి మన తెలుగు సినిమా నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో చిన్న సినిమానే అయినప్పటికీ కూడా క్రేజీ హైప్ ని క్రియేట్ చేసుకున్న చిత్రం “హనుమాన్” కూడా ఒకటి. గత ఏడాదిలో వచ్చిన టీజర్ తోనే ఆడియెన్స్ ఓ రేంజ్ లో హైప్ తెచ్చుకున్నారు.

కాగా ఈ భారీ చిత్రాన్ని ఎట్టకేలకి మేకర్స్ ఈ సంక్రాంతి కానుకగా అది కూడా చాలా అడ్డంకులు ఇబ్బందులు భారీ పోటీ నడుమ రిలీజ్ చేశారు. మరి ఇంత కష్టంలో కూడా హనుమాన్ సినిమాకి ఇప్పుడు విడుదల అయ్యిన అన్ని చోట్ల నుంచి కూడా సెన్సేషనల్ రిపోర్ట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

కాగా తెలుగు స్టేట్స్ లో జస్ట్ నార్మల్ గా స్టార్ట్ చేసిన ప్రీమియర్స్ కి రికార్డు రెస్పాన్స్ రాగ ఆ షో లెక్కని ఇంకా పెంచుతూ వెళితే ఇంకా బుకింగ్స్ నమోదు అయ్యాయి. దీనితో హనుమాన్ పై హైప్ ఓ రేంజ్ లో ఉందని అందరికీ అర్ధం అయ్యింది. ఇక ఈ అంచనాలు అన్నీ రీచ్ అయ్యింది అనేది కూడా ఒకటి స్టార్ట్ అయ్యింది.

దీనితో హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర తప్పకుండా వర్కౌట్ అవుతుంది అనేది ఇక్కడ ఫిక్స్ అయ్యిపోయింది. ఇలా మొత్తంగా అయితే ఈ యంగ్ టీం తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ మరియు కొత్త నిర్మాత నిరంజన్ రెడ్డిలు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్నే అందుకున్నారని చెప్పవచ్చు. కాగా ఇప్పుడు హనుమాన్ వసూళ్లు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.