పెళ్లయిన మరుసటి రోజు భర్తకు షాక్ ఇచ్చిన హన్సిక… అసలేమైందంటే?

అల్లు అర్జున్ హీరోగా దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి హన్సిక. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనంతరం పలు యాడ్స్ ద్వారా కూడా సందడి చేశారు. ఇకపోతే ఈమె 15 సంవత్సరాలకే హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా హన్సిక నటించిన మొదటి సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులో ఎంతోమంది యంగ్ హీరోల సరసన నటించి సందడి చేశారు.ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి హన్సిక కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

తన బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి సోహెల్ కతురియా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జైపూర్ లోని మంటోడ ప్యాలెస్ ఎంతో వైభవంగా జరిగింది.ఇక వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇకపోతే హన్సిక వివాహం జరిగి 24 గంటలు కూడా కాకుండానే ఈమె తనదైన స్టైల్ లో తన భర్తకు షాక్ ఇచ్చారు.

ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే సాధారణంగా పెళ్లయిన తర్వాత చాలామంది హనీమూన్ కోసం ఎన్నో ప్లాన్స్ వేస్తారు. ఈ క్రమంలోనే హన్సిక దంపతులు సైతం హనీమూన్ కోసం మాల్దీస్ వెళ్లాలని ప్లాన్ చేశారట. అయితే ప్రతి ఒక్క విషయంలోను ఎంతో విభిన్నంగా ఆలోచించే హన్సిక మాల్దీవులలో కాకుండా ఇటలీ లేదా స్విట్జర్లాండ్ వెళ్లాలని ప్లాన్ చేసినట్టు తన భర్తకు చెప్పడంతో తన భర్త సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఇలా సడన్ సర్ప్రైజ్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారనీ తెలుస్తోంది.