పెళ్ళి విషయంలో నయన్ ని ఫాలో అవుతున్న హన్సిక… ఓటిటిలో టెలికాస్ట్ కానున్న వివాహ మహోత్సవం?

దేశముదురు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశముదురు సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హన్సిక మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అయితే తెలుగు సినిమాలలో నటించకపోయినా కూడా ఆమె మీద ఉన్న అభిమానం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉండగా చాలా కాలంగా హన్సిక పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదట హీరో శంభో తో ప్రేమాయణం నడిపిన హన్సిక అతన్ని పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా వీరిద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది. ఇక ఇటీవల హన్సిక పెళ్లి వార్త మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఇటీవల కాబోయే భర్తతో కలిసి ప్యారిస్ లో ఈఫిల్ టవర్ ఎదురుగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకి కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది.

ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త సోహైల్ కతూరియా అనే వ్యక్తిని హన్సిక వివాహం చేసుకోబోతోంది. బిజినెస్ పరంగానే సోహైల్, హన్సిక మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు వెళుతుంది. డిసెంబర్ 4వ తేదీన జైపూర్ లోని ముంటోడా ప్యాలెస్ లో హన్సిక వివాహం ఘనంగా జరగనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా హన్సిక పెళ్లి గురించి మరొక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. వెడ్డింగ్ కవరేజ్ విషయంలో హన్సిక నయనతారను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. నయనతార తన వెడ్డింగ్ కవరేజ్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఇప్పుడు హన్సిక వివాహ వేడుకని కూడా ఓ ఓటిటి సంస్థ లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మేరకు ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.