అలాంటి పాత్రలు చేసి ఉంటే కోట్లు సంపాదించేదాన్ని.. నటి కామెంట్స్ వైరల్?

తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ నాని వంటి హీరోల సరసన నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అను ఇమ్మాన్యుయేల్ గురించి అందరికీ సుపరిచితమే ఈమె హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు. అయితే ఈమె నటించిన సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. అయితే చాలా రోజుల తర్వాత ఈమె అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో ఇందులో ఈమె పాత్రకు మంచి ప్రశంసలు అందాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అను మాట్లాడుతూ..తాను నటించిన కొన్ని సినిమా ఫలితాలను చూసిన తర్వాత కథల ఎంపిక విషయంలో పూర్తి మార్పులు చేసుకున్నానని ఒక కథ నా వరకు వస్తే ఆ పాత్రకు నేను సరిపోతానా లేదా అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని సినిమాకు సంతకం చేస్తానని తెలిపారు.

సినిమాలలో నటించాలన్న ఉద్దేశంతో చెత్త పాత్రలు పిచ్చిపిచ్చి పాత్రలు వచ్చిన సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా లేనని అలాంటి సినిమాలలో చేయకపోతే నాకు గడవదు అనే స్థితిలో తాను లేనని ఈమె తెలిపారు.ఇలా నా వద్దకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయని ఆ సినిమాలన్నీ కనుక చేసి ఉంటే ఇప్పటికి నేను కూడా కొన్ని కోట్ల రూపాయల డబ్బు సంపాదించే దాన్ని అంటూ అను ఇమ్మాన్యుయేల్ తన కెరియర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.