జూన్ 13న విడుదల కావాల్సిన మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తాత్కాలికంగా రద్దయ్యింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ భారీ ఈవెంట్ నిర్వహించేందుకు టీమ్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే అనూహ్యంగా ఈ కార్యక్రమాన్నివాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
తాజాగా గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది. విమానంలో 242 మంది ఉన్నారని తెలుస్తోంది. మృతుల సంఖ్య అధికారికంగా నిర్ధారించాల్సి ఉన్నప్పటికీ, అనేకమంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రస్తుతం రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
ఈ దుర్ఘటన పట్ల గాఢ సంతాపం ప్రకటించిన మంచు విష్ణు, కన్నప్ప ట్రైలర్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టు తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. దుర్ఘటనలో మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించినట్లు తెలిపారు. ఇక కన్నప్ప ట్రైలర్ జూన్ 14న విడుదల చేయనున్నట్లు సమాచారం.