కొన్ని సినిమాలకి ఫలితంతో అసలు సంబంధం లేదు. కేవలం ఆడియో తో కూడా హిట్ అయ్యిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇక ఇపుడు రోజుల్లో అయితే ఆడియో విషయంలో చాలా కేర్ ని మేకర్స్ తీసుకుంటున్నారు. అయితే ఓ సినిమా ఫలితంలో మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర చాలా బలంగా ఉంటుంది.
వారి పాటలు గాని లేదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాని చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఒక్కసారి పాటలు గాని ఎలాంటివో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాని లేకుండా ఏ సినిమాని కూడా మనం చూడలేం. మరి అలా సౌత్ సినిమా దగ్గర ఒక టైం లో తన మ్యూజిక్ తో సంగీత ప్రియులని ఒక ఊపు ఊపిన సంగీత దర్శకుడు హరీష్ జై రాజ్.
రీసెంట్ గానే తాను కంపోజ్ చేసిన “ఆరెంజ్” రీ రిలీజ్ అయ్యి పాటలకి ఏ స్థాయి రెస్పాన్స్ అందుకుందో కూడా అందరికీ తెలుసు. ఈ సినిమాలో పాటలకి అంత పెద్ద పాత్ర ఉంది. అయితే ఈ సినిమా దర్శకుడు విజయ్ భాస్కర్ ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని హరీష్ పై రివీల్ చేయడం జరిగింది.
హరీష్ జై రాజ్ తో వర్క్ ఎలా ఉంటుంది అంటే. తాను కంపోజ్ చేసిన ఏదైనా ట్యూన్ హీరోకి గాని దర్శకునికి గాని నచ్చకపోతే దానిని తన లిస్ట్ నుంచి వెంటనే డిలీట్ చేసేస్తాడని పొరపాటున కూడా దానిని వేరే సినిమాకి పెట్టేయడం కానీ అలాంటి ట్యూన్ ని మళ్ళీ కంపోజ్ చేయడం గాని చేయడని తెలిపారు. నిజంగా ఓ సంగీత దర్శకునికి ఇలాంటి లక్షణం ఉండడం గొప్ప లక్షణమే అని చెప్పాలి. ఇప్పుడు మిగతా సంగీత దర్శకులు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.