గాసిప్స్ : అక్కడ రష్మికా మందన్నా సినిమాలు బ్యాన్.?

తమ ఫిలిం కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉండొచ్చు కానీ దానిని నిలబెట్టుకొని కొనసాగేవారు తక్కువమందే ఉన్నాయని చెప్పాలి. మరి అలాంటి హీరోయిన్స్ లో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా ఒకామె కాగా ఇప్పుడు ఈమె ఏకంగా పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్ గా మారింది.

ఇక ఇదిలా ఉండగా రష్మికా అయితే మొదట రష్మికా ఇండస్ట్రీ నుంచి వచ్చి మన టాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ఇక్కడ బాగా పేరు వచ్చాక హిందీ మార్కెట్ లోకి కూడా వెళ్ళింది. మరి ఇప్పుడు అయితే ఈమె సినిమాలపై ఓ సినిమా ఇండస్ట్రీ బ్యాన్ విధిస్తున్నట్టుగా కొన్ని గాసిప్స్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరి ఆ ఇండస్ట్రీ కూడా ఏదో కాదు ఆమె కన్నడ ఇండస్ట్రీనే అట. సరైన కారణం ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు కానీ కన్నడ సినిమాలో అయితే ఇక రష్మికా ఉంటే ఏ సినిమా అయినా సరే థియేటర్స్ లో వెయ్యరని కొన్ని షాకింగ్ వార్తలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.

దీనితో అయితే ఇప్పుడు ఆమె పుష్ప 2, వారసుడు లాంటి భారీ చిత్రాలు శాండిల్ వుడ్ లో ఇబ్బంది పడేలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే అసలు ఈ బ్యాన్ ఎందుకు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.