గాసిప్స్ : “పుష్ప2” రిలీజ్ ఏకంగా అప్పటికి షిఫ్ట్ అయ్యిందా?

పాన్ మార్కెట్ లో ఎలాంటి రాజమౌళి లేకుండా తన స్టార్డం తో 100 కోట్ల వసూళ్ళని కొల్లగొట్టిన హీరోగా నిలిచిన హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన లాస్ట్ సినిమా “పుష్ప” తో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ నెక్స్ట్ అయితే పుష్ప 2 చేయనున్నాడు.

మరి ఈ సినిమా ఉండి ఉండి మరింత ఆలస్యం అవుతూ వస్తుండగా సినిమా అప్డేట్ కోసం మరోపక్క అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం అయితే ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియలేదు కానీ ఇప్పుడు అయితే సినిమా రిలీజ్ పై కొన్ని షాకింగ్ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మొదట్లో అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి లేదా డిసెంబర్ రిలీజ్ కి ప్లాన్ చెయ్యగా ఇప్పుడు అయితే ఈ డేట్ మారిపోయినట్టుగా తెలుస్తుంది. మరి ఈ గాసిప్స్ ప్రకారం ఈ చిత్రం ఏకంగా వచ్చే ఏడాది కాకుండా ఆ నెక్స్ట్ ఏడాది అంటే 2024 సంవత్సరం వేసవిలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

ఇప్పుడున్న సమీకరణాలతో అయితే ఈ చిత్రం 2024 లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాని అయితే మరింత బడ్జెట్ తో దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తుండగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే భన్వర్ సింగ్ షెకావత్ గా వెర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు.