గాసిప్స్ : మహేష్ ట్రాక్ తో పవన్ కి హీరోయిన్స్.!

తెలుగు సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఇద్దరు కూడా ఇద్దరూ ఇద్దరే.. తన సినిమాల ఓపెనింగ్స్ గాని సోషల్ మీడియా రికార్డులు గాని ఇద్దరికీ ఇద్దరూ పోటీదారులు కాగా ఇప్పుడు తమ సినిమాలతో అయితే ఇద్దరు కూడా బిజీ గా ఉన్నారు.

కాగా మహేష్ అయితే ఇపుడు ఒక్క సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బిజీగా ఉండగా పవన్ మరోపక్క పలు చిత్రాలు ఓకే చేసి బిజీ గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య ఓ ఇంట్రెస్టింగ్ కనెక్షన్ కనిపిస్తున్నట్టుగ్గ సినీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే మరియు శ్రీ లీల లు నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే నెక్స్ట్ పవన్ సినిమాల్లో కూడా ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని తెలిసిందే. కాకపోతే ఇప్పుడు పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఇదే ట్రాక్ ఓకే చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే తో పాటుగా శ్రీ లీల కూడా ఓకే అయ్యినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

అంత కాకుండా నెక్స్ట్ సుజీత్ సినిమాలో వేరేగా శ్రీ లీల అలా కూడా ఓకే అయ్యింది. మరి ఈ కొత్త రూమర్స్ ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి. ఈ రకంగా అయితే పవన్ మహేష్ ని ఫాలో అవ్వాల్సి వచ్చింది అని చెప్పుకోవాలి.