గోపిచంద్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్

మ్యాచో స్టార్ అనే ఇమేజ్ తో టాలీవుడ్ లో మాస్ కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు గోపీచంద్. ప్రభాస్ తో సమానంగా గోపీచంద్ కెరియర్ స్టార్ట్ చేశాడు. అయితే మొదటి సినిమానే అతనికి పెద్ద డిజాస్టర్ గా ఖాతాలో వచ్చి చేరింది. దీంతో విలన్ గా టర్న్ తీసుకొని జయం, వర్షం, నిజం సినిమాలలో నటించి మెప్పించాడు.

మరల యజ్ఞం మూవీతో హీరోగా టర్న్ తీసుకొని వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా దూసుకొచ్చాడు. మాస్ యాక్షన్ హీరో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే గోపీచంద్ కెరియర్ లో సక్సెస్ లు కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండటం విశేషం. తాజాగా శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణం సినిమాతో గోపీచంద్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అతని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే కావడం విశేషం.

అలాగే లక్ష్యం, లౌక్యం లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కావడంతో గోపీచంద్ ఈ మూవీ హ్యాట్రిక్ కొడతానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడు. అర్జానిక్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్, ఫ్యామిలీ డ్రామాతో కథని తెరకెక్కించడంతో కచ్చితంగా సక్సెస్ అవుతుందని సినీ విశ్లేషకులు కూడా అంచనా వేశారు.

దానికి తగ్గట్లుగానే బిజినెస్ కూడా జరిగింది. అయితే ఊహించని విధంగా మొదటి ఆట నుంచే ఈ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఫిల్మ్ క్రిటిక్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ నుంచి కూడా మూవీకి నెగిటివ్ టాక్ రావడం విశేషం. ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ఒక్క కాన్సెప్ట్ తప్ప మిగిలిన కథ అంతా రొటీన్ ఫార్మాట్ లో ఉండనే టాక్ వచ్చింది. ఎక్కడా కూడా మెప్పించే అంశాలు రామబాణంలో లేవనే ఆడియన్స్ నుంచి వచ్చిన రివ్యూ.

దానికి తగ్గట్లుగానే ఈ సినిమా కలెక్షన్స్ ఉండటం విశేషం. వీకెండ్ మూడు రోజుల్లో కేవలం 2.5 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రామబాణం రాబట్టింది. గోపీచంద్ కెరియర్ లోనే లోయేస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా ఈ చిత్రం నిలవడం విశేషం. ఓ విధంగా చెప్పాలంటే ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా రామబాణం మారిందనే టాక్ వినిపిస్తోంది.