మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట .. ‘సీటీమార్’ టీజ‌ర్ విడుద‌ల ‌!

హీరో గోపీచంద్‌ను గత కొన్నేళ్లుగా సక్సెస్ దోబూచులాడుతోంది. ‘లౌక్యం’ తర్వాత సరైన సక్సెస్ లేని గోపిచంద్.. ఆ తర్వాత చేసిన ‘పంతం’ సినిమాతో హిట్టు కొట్టలేకపోయాడు. మధ్యలో ‘జిల్’ సినిమాతో మాత్రం కాస్త పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Gopichand - Seetimaarr Teaser: గోపీచంద్, తమన్నాల ‘సీటీమార్’ టీజర్ విడుదల.. కూత మాములుగా లేదుగా..

పైగా ‘గౌతమ్ నందా’ తర్వాత గోపీచంద్, సంపత్ నంది కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్‌లో గోపీచంద్ .. కబడ్డీ కోచ్‌లో పాత్రలో నటించాడు. ఈ టీజర్‌లో గోపీచంద్ మరోసారి తన యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కబడ్టీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. కబడ్డీ కోచ్‌గా గోపీచంద్ ఆహార్యం ఆకట్టుకునేలా ఉంది. మొత్తంగా కబడ్డీ కోచ్ గెలవకుండా కొన్ని దుష్ట శక్తులు ఎలా ప్రయత్నించాయి. దాన్ని కబడ్డీ కోచ్‌గా గోపీచంద్ ఎలా అడ్డుకున్నాడనేది ఈ సినిమా స్టోరీలా కనిపిస్తోంది.

ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా నటిస్తున్నాడు. మరోవైపు తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది. మరో కథనాాయకగా దిగాంగన నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన ‘గౌతమ్ నందా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌‌డ్ టాక్ సొంతం చేసుకుంది. మరి అపుడు సక్సెస్ లేని గోపీచంద్ ఈ సారైనా హిట్టు కొట్టి సీటీమార్ అనిపిస్తాడో లేదో చూడాలి.

#Seetimaarr Official Teaser | Gopichand | Tamannaah | Sampath Nandi | Mani Sharma