“కాంతారా” ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.!?

Kantara Movie Review

రీసెంట్ గా థియేటర్స్ లో అలాగే మొన్ననే ఓటిటి లో కూడా వచ్చి పెను సంచలనంగా మారినటువంటి లేటెస్ట్ చిత్రం “కాంతారా”. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి మరో భారీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం 400 కోట్లకి పైగా భారీ గ్రాస్ ని కొల్లగొట్టి కన్నడలో కేజీఎఫ్ 2 లాంటి ఇండస్ట్రీ హిట్ ని దాటేసే రేంజ్ కి వెళ్ళిపోయింది.

ఇక దీనితో ఈ చిత్రం సెన్సేషన్ థియేటర్స్ లో కొనసాగుతుండగానే ఓటిటి యాప్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అన్ని సౌత్ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరిఇలా రావడంతోనే కాంతారా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు మేకర్స్.

సినిమాలో వరాహ రూపం సాంగ్ వేరే వెర్షన్ ని పెట్టడంతో పెద్ద రచ్చే జరగ్గా ఇప్పుడు ఫైనల్ గా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ బయటకి వచ్చింది. ఈ చిత్రం పాట విషయంలో కన్నడ కోర్టు కాంతారా యూనిట్ కి మద్దతుగా తీర్పు ఇవ్వడంతో ఒరిజినల్ సాంగ్ ని అయితే సినిమాలో యాడ్ చెయ్యొచ్చని తెలుస్తుంది.

దీనితో అతి త్వరలోనే మళ్ళీ పాత సాంగ్ ని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్ చేసే ఛాన్స్ ఉందని అలాగే ఇది త్వరలోనే ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాని అయితే రిషబ్ శెట్టి హీరోగా నటించగా తానే ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. అలాగే కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు నిర్మాణం అందించారు.