Gold and Silver: మరోసారి బంగారం వెండి ధరలు డౌన్: ఏం జరుగుతోంది?

బంగారం, వెండి మార్కెట్లు మళ్లీ ఒత్తిడిలోకి జారుకున్నాయి. మంగళవారం ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.332 నష్టంతో రూ.92,965 వద్ద ట్రేడయ్యాయి. అదే సమయంలో జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.281 తగ్గి కిలోకు రూ.95,172కి చేరాయి. గరిష్ఠంగా రూ.99,000 పైకి వెళ్లిన పసిడి ధర, గత రెండు వారాల్లో క్రమంగా వెనక్కి వచ్చి ఇప్పుడు రూ.6,500 పైగా నష్టాన్ని మూటగట్టుకుంది. ఇదే సమయంలో వెండిలోనూ ఊగిసలాట కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా మాత్రం మూడీస్ అమెరికా క్రెడిట్ రేటింగ్‌పై సానుకూల వ్యాఖ్యలు చేయడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య సంభవిస్తున్న శాంతి చర్చలు ఈ లోహాలపై ప్రెషర్ పెంచాయి. బంగారం ఔన్స్ ధర 3,320 డాలర్ల దిగువకు జారగా, వెండి 32 డాలర్ల మార్క్‌ దిగువకు పడిపోయింది. అయితే సోమవారం నాటి ట్రేడింగ్ ముగిసే సమయానికి గోల్డ్ రూ.93,297, సిల్వర్ రూ.95,453 వద్ద స్వల్ప లాభాలతో నిలిచాయి.

డాలర్ ఇండెక్స్ బలహీనపడటం వల్ల బంగారానికి కొంత ఊరట లభించినప్పటికీ, సమయానుకూలంగా జరిగే అంతర్జాతీయ పరిణామాలు ఈ మార్కెట్‌కు దిశను నిర్దేశిస్తున్నాయి. ప్రిథ్వీఫిన్‌మార్ట్ నిపుణుడు మనోజ్ కుమార్ జైన్ ప్రకారం, ఈ వారం బంగారం రూ.92,750కు మద్దతు, రూ.94,400 వద్ద రిజిస్టెన్స్ ఎదుర్కొనవచ్చు. అలాగే వెండి రూ.94,800 వద్ద బేస్, రూ.96,650 వద్ద రిసిస్టెన్స్ అనిపించనుంది.

నిపుణుల సూచన ప్రకారం, వెండిని రూ.94,800 సమీపంలో కొనుగోలు చేసి, రూ.94,150 స్టాప్‌లాస్‌తో రూ.96,100 టార్గెట్‌గా పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. కానీ అంతర్జాతీయ వార్తలపై వేచి ఉండి ట్రేడింగ్ చెయ్యడం శ్రేయస్కరం అనే హెచ్చరిక కూడా వెలువడుతోంది.