ఓటిటిలో ప్రత్యక్షమైన గాడ్ ఫాదర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇకపోతే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటీవల దసరా పండుగ కానుకగా విడుదల అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే మొదట్లో ఈ సినిమాకు పరవాలేదు అనిపించే విధంగా టాక్ వచ్చినప్పటికీ రాను రాను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ అభిమానులు గాడ్ ఫాదర్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎటువంటి అప్డేట్ లేకుండా మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఓటిటి లో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ గాడ్ ఫాదర్ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా అనగా నేడు నవంబర్ 19 నుంచి నెట్ పిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోందీ. ఇకపోతే ఖైదీ నెంబర్ 150 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్న ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తర్వాత సైరా, ఆచార్య సినిమాలలో నటించాడు.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు సినిమాలు ఊహించని విధంగా భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. రెండు సినిమాల తర్వాత విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా పరవాలేదు అనిపించేలా మంచి సక్సెస్ ను సాధించింది. కానీ విడుదలైన వారం రోజులకే మళ్ళీ నెగటివ్ టాక్ వినిపించడంతో మెగాస్టార్ అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ అభిమానులు వాల్తేరు వీరయ్య సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా నుంచి విడుదలైన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు కానుకగా విడుదల కానుంది. మరి మెగాస్టార్ చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమా అయినా కలిసి వస్తుందో రాదో చూడాలి మరి. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో మరో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నట్టు సమాచారం.