గాడ్ ఫాదర్ హిట్ … సల్మాన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్..?

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం “గాడ్ ఫాదర్” . లూసిఫర్ అనే మలయాళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాకి మోహన రాజా దర్శకత్వం వహించారు. పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కిన ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి కీలక పాత్రలో నటించగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు.

ఇక ఈ సినిమాలో సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇది ఇలా ఉండగా చిరంజీవి కోరిక మేరకు గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోలేదని చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

అందువల్ల సల్మాన్ ఖాన్ కోసం చిరంజీవి ఒక మంచి బహుమతి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్‌కు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వాలని చిరంజీవితో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది. మొత్తానికి చిరంజీవి ఆచార్య వంటి ఒక డిజాస్టర్ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.