రివ్యూ : జిన్నా

Ginna Movie Review

నటీనటులు విష్ణు మంచు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిషోర్, సద్దాం, మరియు నరేష్ తదితరులు.

దర్శకుడు సూర్య,
నిర్మాత : మంచు విష్ణు
సంగీతం అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ ఛోటా కె. నాయుడు

ట్రోల్స్‌ బాధితుల్లోనే  పేరుగాంచిన హీరో మంచు విష్ణు.  పైగా మొసగాళ్లు లాంటి డిజాస్టర్‌ తర్వాత  తాజాగా జిన్నా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.   మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో  రివ్యూలో తెలుసుకుందాం.   

కథ : 

మంచు విష్ణు (జిన్నా) తిరుపతికి చెందిన వ్యక్తి. జిన్నా తన స్నేహితులతో కలిసి జిన్నాటెంట్ హౌస్ నడుపుతుంటాడు. అయితే, జిన్నా జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల కారణంగా జిన్నా కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఈ మధ్యలో జిన్నా ఒక గుండా దగ్గర అప్పు చేస్తాడు. ఆ అప్పు తీర్చలేక చివరకు ఆ గుండా పెట్టిన షరతు ఒప్పుకుంటాడు?, ఇంతకీ ఏమిటీ ఆ షరతు?, అతను తన సోదరిని (సన్నీ లియోన్) ఎందుకు వివాహం చేసుకోవాలని కోరతాడు ?, ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ : 

చంద్రముఖి’ జానర్‌లో చంద్రముఖి’ని మించి ‘జిన్నా’ ఉంటుందని విష్ణు మంచు ఎప్పటిలాగే బిల్డప్ పోయాడు. కానీ  ‘చంద్రముఖి’ డార్క్ జానర్ లో వస్తే.. ‘జిన్నా’  ‘చంద్రముఖి అయిపోదు కదా. నిజంగానే జిన్నా అవ్వలేదు. ఇటు కామెడీ  అటు థ్రిల్ కాకుండా సాగింది జిన్నా. ఐతే, మంచు విష్ణు పాత్రలో  జిన్నా పాత్రలో  చేసిన అల్లరి బాగుంది. డామినేట్ చేసే క్యారెక్టరైజేషన్  మాడ్యులేషన్ తో తన పాత్రకు మంచు విష్ణు ఫర్ఫెక్ట్ న్యాయం చేశాడు.  హీరోయిన్లు పాయల్ రాజ్‌పుత్‌, సన్నీ లియోన్ తమ అందంతో సినిమా స్థాయి పెంచడానికి కిందామీదా పడ్డారు.  వెన్నెల కిషోర్, సద్దాం, మరియు నరేష్ లతో పాటు మిగిలిన నటీనటులు  కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

అయితే,  సింగిల్ ప్లాట్ తోనే  జిన్నా  సినిమా మొత్తం సాగడం.. మొత్తమ్మీద  ఈ సినిమా అందరికీ  కనెక్ట్ కాదు. నిజానికి మంచి విష్ణు పాత్రలో కాన్ ఫ్లిక్ట్ కంటే.. కన్ ఫ్యూజన్ ఎక్కువ ఉంది. దీనికితోడు సన్నీ లియోన్ పాత్రలో సినిమాటిక్ టోన్ పరిధి దాటింది.  అసలు ప్రతి పాత్ర ఒకే ఎమోషన్ తో  సినిమా చివరి వరకు ఉంటే ఎలా నచ్చుతుంది ?, జిన్నా దర్శకుడు సూర్య  ఈ చిన్న పాయింట్ ఎలా వదిలేశాడో !!

కథలో డెప్త్ ఉండాలి. కానీ, జిన్నాలో ఆ డెప్త్ మిస్ అయింది. బలమైన సంఘర్షణతో సాగాల్సిన పాత్రలు నిస్సహాయతతో సాగాయి. అలా సాగిన పాత్రలు ఎప్పటికీ ఎవరికీ కనెక్ట్ కావు. జిన్నా లో జరిగింది అదే.  విష్ణు మంచు ని  విజయవంతమైన  కథానాయకుడిగా ‘జిన్నా’  నిలబెట్టలేకపోయింది.

ప్లస్ పాయింట్స్ :

కొన్ని కామెడీ సీన్స్,
నేపథ్య సంగీతం,
మంచు విష్ణు నటన

మైనస్ పాయింట్స్ 

రెగ్యులర్ అండ్ బ్యాడ్  ప్లే,
రొటీన్ సిల్లీ  కామెడీ  డ్రామా,
హీరోయిన్ సన్నీ లియోన్ ట్రాక్,
జిన్నాలో పుష్కలంగా  లాజిక్స్ మిస్ అవ్వడం,
బోరింగ్ ట్రీట్మెంట్,

తీర్పు :

దీపావళి కానుకగా వచ్చిన ఈ  రొటీన్ క్రైమ్ అండ్ కామెడీ డ్రామా.. వెరీ రెగ్యులర్ వ్యవహారాలతోనే  వెరీ రొటీన్ గా సాగింది. నాసిరకమైన సీన్స్, బోరింగ్ ప్లే విసిగిస్తాయి.   కానీ, కొన్ని కామెడీ సీన్స్  కామెడీ సినిమాలు ఇష్టపడే వారికీ కనెక్ట్ అవుతాయి.   మొత్తమ్మీద  ఈ జిన్నాలో పెద్దగా  మెరుపుల్లేవు.

 రేటింగ్: 2.25 /5