Ginna Review : జిన్నా మూవీ రివ్యూ

డైరెక్టర్: సూర్య
నటీనటులు: విష్ణు మంచు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిషోర్, సద్దాం, నరేష్
నిర్మాత: మంచు విష్ణు
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ :ఛోటా కె. నాయుడు
‘మోసగాళ్లు’ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మంచు విష్ణు జిన్నా అనే మూవీ తో భారీ అంచనాల మధ్య మన ముందుకు వచ్చాడు. ఎప్పుడు లేని విధం గా ఈ సినిమాకి ప్రమోషన్స్ చేసాడు. సన్నీ లియోన్, పాయల్ రాజపుట్ లాంటి క్రేజీ హీరోయిన్స్ ఉన్న ఈ మూవీ ఈ రోజే విడుదలయ్యింది. ఎలా ఉందో చూద్దాం.
కథ :
తిరుపతి లో ఉండే జిన్నా తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక టెంట్ హౌస్ నడుపుతుంటాడు. కానీ ఆ టెంట్ హౌస్ తో ఎప్పుడో ఏదో ఒక చేదు జరుగుతూనే ఉంటుంది. ఊరి నిండా అప్పులు ఉంటాయి. తన బాబాయ్ ఆ ఊరి ప్రెసిడెంట్ కానీ జిన్నా అంటే పడదు. జిన్నా ఎలక్షన్ లో నిలబడి ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాడు కానీ దానికి కావాల్సినంత డబ్బు ఉండదు.
ఆ ఊరిలో ఉండే ఒక  గుండా జిన్నా కి అతని అప్పు తీర్చడానికి ఒక షరతు కూడా పెడతాడు. అదేంటంటే ఒక నెల లో అప్పు తీర్చాలి లేదంటే తన చెల్లిని పెళ్ళిచేసుకోవాలని.
ఇంతలో అనుకోకుండా చిన్నప్పుడు అమెరికా వెళ్లిపోయిన తన ఫ్రెండ్ రేణుక (సన్నీ లియోన్) వస్తుంది. తాను జిన్నా ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటా అంటుంది. కానీ జిన్నా స్వాతి (పాయల్) ని ప్రేమిస్తాడు. కానీ డబ్బు కోసం రేణుక ని ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు.
కానీ ఒక సందర్భంలో సన్నీ లియోన్ తన చిన్నప్పటి ఫ్రెండ్ రేణుక కాదని తెలుస్తుంది. ఇంతకీ సన్నీ ఎవరు, తన చిన్నప్పటి ఫ్రెండ్ కి ఏమైంది అనేది మిగతా స్టోరీ.
ప్లస్ పాయింట్ :
కామెడీ, ట్విస్ట్
మైనస్ పాయింట్స్ :
పెద్దగా లేవు
తీర్పు:
విష్ణు మంచు జిన్నా ప్రేక్షకులను అలరించారు అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లలో థ్రిల్ కి గురి చేసే అంశాలు ఉండటంతో తో పాటు కామెడీ బాగా అలరిస్తాయి. మొత్తానికి ఈ సినిమా చూడొచ్చు.