సోహెల్, అఖిల్ కు ఉచ్చపోయించారు? ఆ వీడియో బయటపెట్టొద్దంటూ బిగ్ బాస్ కు మొర?

ghosts played with sohel and akhil in bigg boss house

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం దెయ్యాలు తిరుగుతున్నాయి. దెయ్యాలు.. ఇంట్లోని సభ్యులను ఏం చేయకుండా ఉండాలంటే అవి చెప్పిన పనులను బిగ్ బాస్ ఇంటిసభ్యులు చేయాల్సి ఉంటుంది. లేదంటే వాళ్లను ఏదైనా చేసేస్తాం అంటూ దెయ్యాలు బిగ్ బాస్ హౌస్ లో తెగ హడావుడి చేస్తున్నాయి.

ghosts played with sohel and akhil in bigg boss house
ghosts played with sohel and akhil in bigg boss house

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందంటే… దెయ్యాల కొంపలా తయారైంది. ఎక్కడ చూసినా.. అస్థిపంజరాలు, సమాధులు.. దెయ్యాల గోలలు. వీటి మధ్య ఉండటమంటే మాటలు కాదు.

కానీ.. తప్పదు కదా. దెయ్యాలను చూసి ముందు.. హే.. దెయ్యాలతోనే ఆడుకున్నాం.. మీరెంత అంటూ సోహెల్, అఖిల్ తెగ పోజులు కొట్టారు. దీంతో దెయ్యాలు వాళ్లిద్దరికి ఓ టాస్క్ ఇచ్చాయి. ఆ టాస్క్ లో భాగంగా మొత్తం దెయ్యం సెటప్ వేసిన ఓ ఇంట్లోకి వెళ్లాలి. అక్కడ దెయ్యం చెప్పిన పని చేయాలి. అక్కడికి వెళ్లాక సోహెల్, అఖిల్ ను మాత్రం దెయ్యాలు ఓ ఆట ఆడుకున్నాయి. దెబ్బకు దడుసుకున్నారు ఇద్దరూ.

లోపల గజగజా వణికిపోయి.. బయటికి మాత్రం దర్జాగా వచ్చారు. ఆ తర్వాత ప్లీజ్ బిగ్ బాస్.. ఆ వీడియో మాత్రం ప్రసారం చేయకండి. ఉన్న ఇజ్జత్ పోతది.. అంటూ బిగ్ బాస్ కు రిక్వెస్ట్ చేశారు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

#Akhil & #Sohel ni aata aadeskunnaru 😂 #BiggBossTelugu4 today at 9:30 PM on @StarMaa