మారుతి క‌ల సాకారానికి చేరువ‌లోనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల‌ని యంగ్ డైరెక్ట‌ర్ మారుతి ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నాడు. బ‌న్నీతో సినిమా చేయ‌డం ఓ డ్రీమ్ గా భావించి క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. కానీ బ‌న్నీ క‌రుణించ‌లేదు. మారుతిపై ఉన్న నెగిటివ్ ఇమేజ్..అత‌ని గ‌త చిత్రాలు మ‌రీ బ్లాక్ బ‌స్ట‌ర్ కాద‌న్న ఒపీనియ‌న్ బ‌న్నీని ఇన్నాళ్లు వెన‌క్కి లాగింది. మారుతి ఇప్ప‌టివ‌ర‌కూ చాలా స్ర్కిప్ట్ లు వినిపంచాడు. కానీ ఆవేవి బ‌న్నీని మెప్పించ‌లేదు. ది బెస్ట్ స్ర్కిప్ట్ కావాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు వెన‌క్కి పంపించేసేవాడు.

అయితే తాజాగా అందుతోన్న స‌మాచారం మేర‌కు బ‌న్నీ మెచ్చిన స్ర్కిప్ట్ మారుతి వినిపించాడ‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇటీవ‌లే బ‌న్నీని క‌లిసి మారుతి మంచి క‌మ‌ర్శియ‌ల్ స్ర్కిప్ట్ వినిపించాడుట‌. రొటీన కు భిన్నంగా ఉన్న స్ర్కిప్ట్ బాగుంద‌ని మెచ్చాడుట‌. చెద్దాం అని ప్రామిస్ చేయ‌కుండా మారుతిని అలా హోల్డ్ లో పెట్టిన‌ట్లు స‌మాచారం. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం బ‌న్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప‌లో న‌టిస్తున్నాడు.

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తికావ‌డానికే చాలా స‌మయం ప‌డుతుంది. అటుపై ఐకాన్ పూర్తిచేయ‌నున్నాడు. ఎలా లేద‌న్నా? ఈ రెండు సినిమాలు పూర్తి కావ‌డానికి ఏడాది ఈజీగా ప‌డుతుంది. మ‌ధ్య‌లో త్రివిక్ర‌మ్, పూరి లాంటి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్లు క‌థ‌లు వినిపిస్తే వాళ్ల‌కీ డేట్లు ఇవ్వ‌క త‌ప్ప‌దు. అస‌లే బ‌న్నీ ఆక‌లి మీదున్నాడు. నా పేరు సూర్య ప్లాప్ తో ఏడాదిన్న‌ర అజ్ఞాతంలోకి వెళ్లొచ్చాడు. అల వైకుంఠ‌ప‌ర‌ములో త్రివిక్ర‌మ్ భారీ ఊర‌ట‌నిచ్చాడు. ఇలా ఇన్ని స‌వాళ్ల మీద బ‌న్నీ మారుతిని లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే అంతిమంగా మంచి స్ర్కిప్ట్ అయితే ఏ హీరో వ‌దులుకోడు అన్న‌ది వాస్త‌వం.

టిల్ లుక్: `పుష్ప` మాసీ ర‌గ్గ్ డ్