అమెజాన్‌ ప్రైమ్‌లో ‘గరుడన్‌’

తమిళ స్టార్‌ కామెడియన్‌ సూరి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ’గరుడన్‌’ . ఈ సినిమాకు దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వం వహించగా.. తమిళ నటుడు శశికుమార్‌, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రల్లో నటించారు. రేవతి శర్మ శివత నాయర్‌ బ్రిగుడ సాగ కథానాయికలుగా నటించారు. ఫ్రెండ్షిప్‌ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మే 31న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇ

ప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రైమ్‌ ఒక పోస్టర్‌ విడుదల చేసింది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ముగ్గురు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. కథ సాగుతున్నకొద్దీ వీళ్ల మధ్య విభేదాలు వస్తాయి. ఆ తర్వాత గొడవలు ప్రారంభమవుతాయి. తర్వాత ఏం జరిగిందన్నది సినిమాలోనే చూడాలి. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాగా.. సూరి కూడా ఇప్పటివరకు ఎన్నడూ చూడని మాస్‌ అవతర్‌ లో కనిపించాడు.

ఇక ఈ చిత్రాన్ని లార్క్‌ స్టూడియోస్‌ , గ్రాస్‌ రూట్‌ ఫిల్మ్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మించాయి. సముద్రఖని, మొª`టటై రాజేంద్రన్‌, మైమ్‌ గోపి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వెట్రి మారన్‌ కథను అందించగా.. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించాడు