అల్లు శిరీష్ చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ అందుకున్నారు. ఈయన హీరోగా నవంబర్ 4వ తేదీ విడుదలైన ఊర్వశివో రాక్షసివో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో శిరీష్ ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అలీ శిరీష్ ను ప్రశ్నిస్తూ సినిమా కథల ఎంపిక విషయంలో మీరే ఫైనల్ నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ఎవరి అయినా సలహా తీసుకుంటారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శిరీష్ సమాధానం చెబుతూ తాను నటించిన గౌరవం, ఏబిసిడి, ఒక్క క్షణం వంటి సినిమాలను విన్న తర్వాత నాన్న ఈ సినిమాలు ఫ్లాప్ సినిమాలు చేయొద్దు అని సలహా ఇచ్చారు కానీ ఆయన మాట వినకుండా నేనే ఈ సినిమాలు చేసి ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నానని తెలిపారు.
ఇకపోతే ఊర్వశివో రాక్షసివో సినిమా కథ వినగానే నాన్న ఈ కథకు శిరీష్ కరెక్ట్ గా సరిపోతారని చెప్పారు నాన్న అనుకున్న విధంగానే ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇకపై తాను నటించే సినిమాలన్నీ కూడా నాన్ననే సెలెక్ట్ చేస్తారంటూ ఈ సందర్భంగా శిరీష్ తన తండ్రి అల్లు అరవింద్ జడ్జిమెంట్ గురించి తెలియజేశారు. నాన్న సినిమాల విషయంలో తన నిర్ణయం ఎప్పుడు ఫర్ఫెక్ట్ గా ఉంటుందని ఆయన చెప్పిన విధంగానే సినిమా ఫలితం కూడా ఉంటుందని శిరీష్ తెలిపారు.