టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 25వ తేదీన విడుదలై మొదటి రోజు డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్లాఫ్ అవడంతో పూరి జగన్నాథ్ , చార్మి భారీగా నష్టపోయారు. ఇక ఈ సినిమా ప్లాప్ అవటంతో పూరి జగన్నాథ్ , చార్మి మీడియాకి సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. అయితే విజయ్ మాత్రం ప్లాప్ ని పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడు.
ఈ క్రమంలో ఇటీవల బెంగళూరులో జరిగిన సైమా అవార్డు ఈవెంట్లో కూడా విజయ్ దేవరకొండ సందడి చేశాడు. ఈ ఈవెంట్ లో జనగణమన సినిమా అప్డేట్ గురించి విలేకరులు విజయ్ ని ప్రశ్నించగా.. ఆ సినిమా గురించి మర్చిపోండి ఇప్పుడు మనం అవార్డు ఫంక్షన్ కి వచ్చాం కాబట్టి ఎంజాయ్ చేయండి అంటూ మాట దాటేసాడు. అయితే విజయ్ ఇలా సమాధానం ఇవ్వటంతో జనగణమన సినిమా ఆగిపోయింది అంటూ వస్తున్న వార్తలలో నిజం ఉందని అభిప్రాయపడుతున్నారు.
లైగర్ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాని విజయ్ దేవరకొండతో తెరకేక్కించడానికి సిద్ధమయ్యాడు. ఇందుకు సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అయితే లైగర్ సినిమా ప్లాఫ్ అవ్వటంతో జనగణమన ప్రాజెక్టు నుండి నిర్మాతలు తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల గురించి పూరి జగన్నాథ్ స్పందించకపోవడంతో ఈ వార్తలలో నిజం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ కూడా ఆ సినిమా గురించి మర్చిపోండి అని చెప్పటంతో నిజంగానే జనగణమన ప్రాజెక్ట్ కి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.