నాకు ఓటమి,గెలుపు రెండు నాకు సమానం:పూజా హెగ్డే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది పూజ హెగ్డే. ఇకపోతే పూజా హెగ్డే గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఆచార్య సినిమా అలాగే రాధేశ్యామ్ సినిమా కూడా ఘోరంగా బోల్తా కొట్టాయి.

అలాగే విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ప్లాపులు పూజా హెగ్డే ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. దీంతో ఆ సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడానికి పూజాహెగ్డే కారణమని, ఆమెది ఐరన్ లెగ్ అంటూ కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకొందరు నెటిజన్స్ అయితే పూజా హెగ్డే ని ఏ సినిమాలో కూడా తీసుకోవద్దు అంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తెరపై ఎంత మంది ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసిన పట్టించుకోని పూజా హెగ్డే ఎట్టకేలకు మౌనం వీడింది.

ఒక మీడియా ఛానల్ తో మాట్లాడిన పూజా హెగ్డే.. తన పై ఐరన్ లెగ్ అనే ముద్ర రోల్స్ చేస్తున్న వారికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది బుట్ట బొమ్మ. నాకు ఓటమి, గెలుపు రెండు నాకు సమానం. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య కథలు నచ్చే వాటిని నేను అంగీకరించాను..ఒక్కోసారి ఫలితాలు తేడాగా రావొచ్చు..మనం ఊహించిన స్థాయిలో సినిమా
కూడా సక్సెస్ అవ్వకపోవచ్చు. కానీ నేను ఒకే చేసిన చిత్రాల రిజల్ట్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాను. అయినా గతంలో నేను ఆరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ చేశాను. అందుకు నేను సంతోషిస్తున్నాను.. అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.