సినిమా హిట్ అవ్వాలంటే బడ్జెట్ కన్నా కంటెంట్ ముఖ్యం: అల్లు అర్జున్

ఎన్నో సినిమాలలో హీరోగా సహాయ నటుడిగా నటించిన శ్రీ విష్ణు ప్రస్తుతం అల్లూరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఈ రిలీజ్ ఈవెంట్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ సినిమా హిట్టు, ప్లాప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా కూడా అల్లూరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి కచ్చితంగా హాజరు కావాలని ముందే నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో సినిమా హిట్, ఫ్లాప్ ల గురించి మాట్లాడుతూ.. సినిమా హిట్ అవ్వాలంటే అందులో కచ్చితంగా కంటెంట్ ఉండాలి. స్టార్ హీరోలతో బంధాల కోట్లు పెట్టి సినిమాలు తీసిన అందులో కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు ఆదరించరు. వందల కోట్లు ఖర్చు చేసిన సినిమాలు ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి అలాగే తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ వెల్లడించాడు.

కరోనా పాండమిక్ తర్వాత ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థియేటర్లకు రావడానికి అలవాటు పడుతున్నారు. అటువంటి సందర్భంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందించడం మన బాధ్యత అంటూ చెప్పుకొచ్చాడు. ఇక విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన శ్రీ విష్ణు తో పాటు అల్లూరి సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రావటంతో ప్రేక్షకులలో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి.