మొత్తానికి “వకీల్ సాబ్” దర్శకుని నెక్స్ట్ సినిమా.. 

Pawan Kalyan, Venu Sriram project may not be happened

టాలీవుడ్ లో కొంతమంది దర్శకులు తమ కెరీర్ లో మంచి హిట్ సినిమాలు ఇస్తున్నప్పటికీ గ్యాప్ మాత్రం అనుకోకుండా వచ్చేస్తుంది. ఏదొక కారణంతో అయితే సినిమా హిట్ పడినా నెక్స్ట్ సినిమా మొదలు పెట్టేందుకు చాలా సమయాన్నే తీసుకుంటారు.

కాగా అలాంటి దర్శకుల్లో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కం బ్యాక్ చిత్రం అయినటువంటి ‘వకీల్ సాబ్’ ని తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆ సినిమా తర్వాత పవన్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ కి కూడా వచ్చేసాయి.

కానీ వేణు నుంచి నెక్స్ట్ సినిమా ఏంటో అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ పాన్ ఇండియాకి సినిమా చేయాల్సి ఉంది. కానీ అది కాస్త ఆగిపోయింది. అయితే నిర్మాత దిల్ రాజుతో కమిట్మెంట్ ఉండగా ఈ సినిమాపై అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

కాగా ఈ చిత్రంలో అయితే హీరోగా నితిన్ ని మేకర్స్ ఫిక్స్ చేయగా ఏ సమయంలో అయినా సరే తమ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు అనౌన్స్మెంట్ రావచ్చు అట. దీనితో మళ్ళీ ఇన్నాళ్ళకి వకీల్ సాబ్ దర్శకుడు మైక్ పట్టుకోబోతున్నాడు అని చెప్పాలి. కాగా ఇప్పుడు నితిన్ అయితే పలు చిత్రాలు చేస్తుందా వాటిలో ఈ ఏడాది దర్శకుడు వక్కంతం వంశితో చేస్తున్న చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ రిలీజ్ కి రాబోతుంది.