హమ్మయ్య “ఉస్తాద్ భగత్ సింగ్” షూట్ ఎప్పుడంటే.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు నటిస్తున్న చిత్రాల్లో యంగ్ హీరోయిన్ శ్రీ లీల తో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి హరీష్ మరియు పవన్ ల నుంచి వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్ తర్వాత రిపీట్ అవుతుండడంతో భారీ హైప్ దీనిపై ఉంది.

అయితే ఈ చిత్రం తమిళ సినిమా “తేరి” కి రీమేక్ అన్నారు కానీ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ చూసాక ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే సెట్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం జస్ట్ ఒక్క షెడ్యూల్ షూట్ మాత్రమే అయ్యింది. అది కూడా దాదాపు 15 రోజులు జరిగినట్టు ఉంది.

ఇక మళ్ళీ పవన్ వారాహి యాత్ర, మొదట ప్రిఫరెన్స్ కూడా “ఓజి” సినిమాకే ఇవ్వడంతో మళ్ళీ పవన్ గత కొన్ని సినిమాల్లానే ఇది కూడా అర్ధం కాకుండా మిగిలిపోతుంది అని రూమర్స్ వచ్చాయి. అయ్యితే ఇప్పుడు ఈ చిత్రం షూట్ కి పవన్ అయితే డేట్స్ కేటాయించినట్టుగా తెలుస్తుంది.

మొదట ఓజి కొన్ని రోజులు కంప్లీట్ చేసాక ఈ జూన్ నెల ఆఖరులో అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కి పవన్ డేట్స్ ఇచ్చినట్టుగా ఇపుడు తెలుస్తుంది. దీనితో వెరీ మచ్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ఆన్ లో ఉన్నట్టుగా పవన్ దగ్గర వర్గాలు లేటెస్ట్ గా చెప్తున్నా సమాచారం. కాగా ఈ చిత్రాన్ని అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.