విడాకులు తీసుకోనున్న దీపికా రణవీర్ ..? క్లారిటీ ఇచ్చిన రణవీర్ సింగ్..?

ప్రస్తుత కాలంలో వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగా విడాకుల తీసుకుని ఒకరికి ఒకరు దూరం అవుతున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్స్ కూడా కొంతకాలానికే విడాకులు తీసుకొని ఒకరికొకరు దూరం అవుతున్నారు. ఇటీవల ఈ విడాకుల జాబితాలో మరొక బాలీవుడ్ స్టార్ కపుల్స్ పేరు కూడా వినిపిస్తోంది. ఆ బాలీవుడ్ జంట మరెవరో కాదు.. దీపికా పదుకునే-రణవీర్ సింగ్.

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా గుర్తింపు పొందిన దీపికా పదుకొనే రణవీర్ సింగ్ 2012 నుండి రిలేషన్ లో ఉంటూ 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే కొన్ని రోజులుగా దీపిక రణవీర్ సింగ్ మధ్య మనస్పర్ధలు రావడం వల్ల వీరిద్దరూ విడిపోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ వార్తలు వైరల్ కావడానికి ముఖ్య కారణం వివాదాస్పద క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు చేసిన ట్వీట్ అని చెప్పాలి.

దీపిక రణబీర్ మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు వచ్చాయని.. తొందర్లోనే వీరు విడిపోవచ్చని అర్థం వచ్చేలా ఉమర్ సంధు చేసిన ట్వీట్ కారణంగా దీపిక రన్వీర్ విడాకుల వార్తలు బాలీవుడ్ లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా వస్తున్న విడాకుల వార్తల గురించి రణవీర్ సింగ్ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల మీడియా ముందుకు వచ్చిన రణవీర్ సింగ్ దీపిక తో తన విడాకుల వార్తల గురించి స్పందిస్తూ ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.

గత పది సంవత్సరాలుగా దీపిక తో నాకున్న అనుబంధం ఎంతో విలువైనది.. దీపికా నాకు దొరికిన అదృష్ట దేవత. జీవితంలో ఆమెను వదులుకోలేను అంటూ విడాకుల గురించి రణవీర్ సింగ్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో వేరే విడాకుల గురించి వస్తున్న రూమర్లకు చెక్ పడింది. రణవీర్ సింగ్ దీపికా పదుకొనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రం ద్వారా దీపికా పదుకొనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.