తెలుగు సినిమాలో నటించనున్న “కాంతారా” హీరో? క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్..!

ప్రస్తుతం తెలుగు కన్నడ భాషలలో విడుదలైన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందుతున్నాయి. తెలుగులో విడుదలైన ఆర్ఆర్ఆర్, సీతారామం, వంటి సినిమాలతో పాటు కన్నడ భాషలో విడుదలైన కే జి ఎఫ్, విక్రాంత్ రోణా’ ,’777ఛార్లీ’ వంటి సినిమాలు దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ ను అలరించిన బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల కన్నడలో విడుదలైన కాంతార సినిమా కూడా దేశవ్యాప్తంగా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 31 తేదీన కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బ్లాక్ మాస్టర్ హిట్ గా నిలిచింది.

దీంతో ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి అక్టోబర్ 15న తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకొని ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాని అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేశాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అవటంతో ఇటీవల అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ రిషబ్ శెట్టి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా సినిమాకు ఎమోషన్ బారియర్ తప్ప భాషతో సంబంధం లేదని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా అందరికీ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యిందని ఈ సినిమా చూసినప్పుడు నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. రిషబ్ శెట్టి నటన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. అందుకే గీత ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా చేయమని ఇప్పటికే రిషబ్ శెట్టి ని కోరాను. తెలుగు సినిమాలో నటించిన కూడా అంగీకరించాడు అంటూ రిషబ్ శెట్టి టాలీవుడ్ ఎంట్రీ గురించి అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలలో నటిస్తున్నాడు. ఆ సినిమాలన్నీ షూటింగ్ పూర్తయిన తర్వాత తెలుగులో నటించనున్నాడని అల్లు అరవింద్ వెల్లడించారు.