హమ్మయ్య..పవన్, సాయితేజ సినిమా నుంచి అదిరే ట్రీట్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తన అభిమానులు నిజంగానే గాడ్ లా ట్రీట్ చేస్తారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ నిజంగా దేవుడిలా కనిపిస్తే ఎలా ఉంటుందో మొదటి సారిగా “గోపాల గోపాల” చిత్రంతో అయితే చూసారు. కాగా మళ్ళీ అదే తరహా లో గెస్ట్ రోల్ లో గాడ్ పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్.

తమ మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు ప్రముఖ నటుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం లో పవన్ కీలక పాత్ర చేశారు. అయితే ఆల్రెడీ తన షూట్ ని కంప్లీట్ చేసుకున్న పవన్ ఇప్పుడు ఇతర సినిమాల్లో బిజీగా ఉన్నారు.

అయితే ఇంట్రెస్టింగ్ గా ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయ్యిన సినిమా నుంచి ఏ అప్డేట్ లేదు కానీ షూటింగ్ లో ఉన్న సినిమాలు నుంచి అదిరే అప్డేట్ లు వస్తున్నాయి. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ మేకర్స్ విషయంలో ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. కానీ ఇపుడు ఈ ప్రాజెక్ట్ పై అయితే మేకర్స్ అదిరే అప్డేట్ ని అందించి ఫ్యాన్స్ తో హమ్మయ్య అనిపించారు.

ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తార్రా బాబు అప్డేట్స్ అనుకునే లోపు ఈ మే 18న ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని కూడా దింపుతున్నట్టుగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం అనౌన్స్ చేశారు. కాగా రేపు సాయంత్రం 4 గంటల 14 నిమిషాలకి ఈ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రానున్నాయట.

ఇక ఈ సినిమాకి ఆల్రెడీ “బ్రో” అనే టైటిల్ ఫిక్స్ అంటున్నారు. మరి ఇదే వస్తుందా లేదా అనేది తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రం జూలై 28న రిలీజ్ కాబోతుంది.