ఇండస్ట్రీ బజ్ : ఫైనల్ గా మహేష్ సినిమాలోకి దిగిన జక్కన్న.!

ఇప్పుడు టాలీవుడ్ సినిమా నుంచి పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న మాసివ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా కూడా ఒకటి.

అయితే ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా ఏకంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో అయితే తెరకెక్కుతుంది. కాగా ఓ భారీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రాజమౌళి తన తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ సరైన కథని స్టార్ట్ చేశారు.

కాగా ఇది వరకే పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తీసుకొని పలు భారీ కొత్త సీక్వెన్స్ లను డిజైన్ చేయిస్తున్న జక్కన్న లేటెస్ట్ గా అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా సినిమాలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం జక్కన్న అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోకి ప్రత్యక్షముగా జాయిన్ అయ్యారట.

అంతే కాకుండా ఈ ఒక్క పరీ ప్రొడక్షన్ పనులే ఏకంగా 6 నుంచి 8 నెలలు ఉంటాయని సినీ వర్గాల్లో లేటెస్ట్ సమాచారాం. దీనితో అయితే ఇంకా కొన్నాళ్ల వరకు మేకర్స్ ఫుల్ బిజీగా ఉండనుండగా ఆ నెక్స్ట్ సినిమా గ్రాండ్ లెవెల్లో లాంచ్ అయ్యి షూటింగ్ ని స్టార్ట్ చేసుకోనుంది. కాగా ఈ సినిమా సుమారుగా 600 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుండగా హాలీవుడ్ నటులు కూడా నటిస్తారని గాసిప్స్ ఉన్నాయి. మరి ఇవి ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.