ఫైనల్ గా ఆ భారీ సినిమాతో స్టార్ట్ చేసిన ప్రభాస్..!

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి రానున్న పలు మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా “సలార్” కూడా ఉంది. ఇక రేపు ఈ సినిమా మాస్ ట్రైలర్ కట్ కూడా రిలీజ్ కాబోతుంది. దీనితో ఈ ట్రైలర్ పై ఎనలేని అంచనాలు నెలకొనగా ఈ ట్రైలర్ ఇది వరకే వచ్చేయాల్సింది.

కానీ మధ్యలో ప్రభాస్ కి ఆరోగ్యం బాగోలేక తాను ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో మేకర్స్ దానిని ఆపారు. అయితే ఫైనల్ గా ప్రభాస్ తన ట్రీట్మెంట్ ముగించుకుని తిరిగి వచ్చాడు కానీ మళ్ళీ ఏ సినిమా స్టార్ట్ చేసాడు ఏంటి అనే వివరాలు ఏవి బయటకి రాలేదు. కొన్ని సినిమాలకి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లు పెడుతున్నాడు తప్ప ఏ సినిమా షూటింగ్ లో ఉన్నాడు వగైరా ఇన్ఫో అనేది లేదు.

అయితే ఇప్పుడు ఫైనల్ గా అసలు ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నాడో తెలిసింది. ప్రభాస్ ఇప్పుడు తన వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్ కల్కి సినిమాలో బిజీగా ఉన్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మాసివ్ విజువల్ వండర్ ని ప్రభాస్ రీస్టార్ట్ చేయగా ఇప్పుడు మూడు రోజులు నుంచి సినిమా షూటింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది.

అంతేకాకుండా ఈ షూట్ లోనే ఉలగనయగన్ కమల్ హాసన్ కూడా పాల్గొనగా ఇద్దరి మీదా సన్నివేశాలు ఇప్పుడు తెరకెక్కిస్తున్నారట. సో ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో దీపికా పదుకొనె అలాగే దిశా పటాని తదితరులు నటిస్తుండగా ఇండియా లోనే కాస్ట్లీ ప్రాజెక్ట్ గా వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.