ఫైనల్ గా ‘ చెక్ ‘ పెట్టడానికి సిద్దమైన నితిన్ ..!

భీష్మ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ ఫాం లోకి వచ్చాడు యంగ్ హీరో నితిన్. ఈ సినిమా ఇచ్చిన కిక్ తో వరసగా టాలీవుడ్ లో సినిమాలు ప్రకటించాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహానటి ఫేం కీర్తి సురేష్ నితిన్ కి జంటగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

కాగా నితిన్ నటించబోతున్న మరో సినిమా మీద ప్రేక్షకులు అధికారక ప్రకటన ఎప్పుడు వెలువడనిందా అని ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ సినిమానే క్రియేటివ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ సినిమా. ఈ సినిమా కోసం హీరో నితిన్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కాగా తాజాగా ఈ కాంబినేషన్ లో రూపొందనున్న టైటిల్ తో పాటు నితిన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి అధికారకంగా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు.

‘చెక్’ అన్న ఆసక్తికరమైన టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఏలేటి మార్క్ స్టైల్లోనే ఆసక్తిగా ఉంది. నితిన్ చేతికి బేడీలు ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ చదరంగం ఆడుతున్నట్టుగా ఉండి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఈ సినిమాని భవ్య క్రియోషన్స్ బ్యానర్ లో వి ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రియా ప్రకాష్ వారియర్ కూడా మరో పాత్రలో నటిస్తుంది.