ఫైనల్ గా కళ్యాణ్ రామ్ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఖరారు.!

టాలీవుడ్ నందమూరి కుటుంబం నుంచి ఉన్న హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా బాలయ్య లు తమ గత చిత్రాలతో భారీ హిట్స్ కొట్టారు. ఇక మరో హీరో కళ్యాణ్ రామ్ కూడా “బింబిసార” అనే సినిమాతో సెన్సేషనల్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక అక్కడ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తుండగా అలా చేసిన ఓ ప్రయోగాత్మక చిత్రం “అమిగోస్” ప్లాప్ అయ్యింది.

అయితే ఈ సినిమా తర్వాత తాను చేస్తున్న మరో చిత్రమే అది కూడా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చిత్రమే “డెవిల్”. ఓ ఇండియా బ్రిటిష్ ఏజెంట్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని అభిషేక్ తెరకెక్కిస్తున్నారు. అయితే కొన్ని కారణాల చేత మేకర్స్ ఒరిజినల్ దర్శకుణ్ణి పక్కన పెట్టి నిర్మాతే ఇప్పుడు దర్శకుడిగా పెట్టుకోగా.. 

ఈ భారీ సినిమా రిలీజ్ ఎప్పటి నుంచో అలా వాయిదా పడుతూ వస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ని అయితే ఇప్పుడు మేకర్స్ ఫైనల్ గా ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా ఈ డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

దానికి ముందు భారీ చిత్రం సలార్ పాన్ ఇండియా రిలీజ్ తర్వాత ఆ నెక్స్ట్ వీక్ లోనే ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ భారీ చిత్రంలో టాలీవుడ్ హిట్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే అభిషేక్ పిక్చర్స్ వారు చాలా ఖర్చు తోనే సినిమాని నిర్మాణం వహించారు. 
dhttps://twitter.com/AbhishekPicture/status/1732743737066041687