“ఆదిపురుష్” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ఓంరౌత్.!

పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాల్లో దర్శకుడు ఓంరౌత్ మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి.

ఇండియన్ సినిమా దగ్గర ప్రస్తుతానికి అత్యధిక బడ్జెట్ సినిమాగా మాత్రమే కాకుండా భారీ విజువల్స్ ఉన్న సినిమాగా కూడా ఈ చిత్రానికి భారీ హైప్ ఉంది. మరి ఈ సినిమాని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తుండగా కానీ ఈ సినిమాపై ఏ అప్డేట్ ఏది లేక అలా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

దీనితో ముఖ్యంగా దర్శకుడు విషయంలో గుస్సా గా ఉన్న అభిమానులు నెగిటివ్ ట్రెండ్ కి కూడా ప్లాన్ చెయ్యగా ఇప్పుడు దీనికి కోసం అన్నట్టుగా దర్శకుడు ఓంరౌట్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అయితే అందించాడు.

ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని ఈ పనులు చాలా త్వరగా చేస్తున్నామని తెలిపాడు. అలాగే దేశ వ్యాప్తంగా ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరిచి తీరుతుంది అని ఓంరౌత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు. దీనితో ఈ బిగ్ స్టేట్మెంట్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.