క‌రోనా పంచ్‌: పుట్టిన‌రోజే మ‌ర‌ణించిన నిర్మాత‌

నిర్మాత‌కు బ‌ర్త్ డేనే డెత్ డే!

కరోనా మ‌హ‌మ్మారీ ఒక నిర్మాత కం నాయ‌కుడిని అనంత‌లోకాల‌కు తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ డీఎంకే ఎమ్మెల్యే.. త‌మిళ నిర్మాత‌ అన్బళగన్‌(62) బుధవారం ఉదయం కన్ను మూశారు. ప్రస్తుతం చేప్పాక్కం ఎమ్మెల్యేగా ఉన్న అన్బళగన్‌… 2001, 2011, 2016లో కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత కరుణానిధి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు సన్నిహితంగా ఉండేవారు.

నిర్మాత‌గా.. పంపిణీదారుడిగా ఆయ‌న‌కు సుదీర్ఘ అనుభ‌వం ఉంది. తమిళంలో నటుడు జయం రవితో `ఆదిభగవాన్` అనే చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. జన్మించిన రోజే మరణించడం బాధాకరం. ఒక శాసనసభ్యుడు కరోనా సోకి మరణించడం దేశంలో ఇదే ప్రథమం. 

అన్బళగన్‌ మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప‌లు పార్టీల నేతలు సంతాపం తెలిపారు. తెలుగు సినీప‌రిశ్ర‌మ నుంచి ఆయ‌న మృతికి సానుభూతి వ్య‌క్త‌మైంది.