అంది వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడంలో దగ్గుబాటి సురేష్ ముందు వుంటాడని అంటారు . సినిమా రంగంలో రామానాయుడును అందరు మూవీ మొఘల్ అని గౌరవిస్తారు . సినిమా కథలు విని వాటిని అంచనా వెయ్యడంలో రామానాయుడు సిద్ధహస్తుడు . అందుకే సురేష్ సంస్థలో అన్నీ విజయ వంతమైన సినిమాలు తీయగలిగాడు . అయితే రామానాయుడును మించిపోయాడు సురేష్ బాబు అని ఎప్పుడో నిరూపించుకున్నాడు. ముందు కథ నచ్చాలి, దర్శకుడు పై నమ్మకం కుదరాలి, కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకున్నాక షూటింగ్ మొదలు పెడతారు . అయితే షూటింగ్లో సురేష్ బాబు ప్రమేయం తప్పకుండా వుంటుందట . రామానాయుడు కైనా పట్టు విడుపులు ఉంటాయి కానీ సురేష్ బాబు విషయంలో మాత్రం వుండవు . అతను పక్కా వ్యాపార వేత్త. . వ్యాపారంలో కూడా లాభం ఉంటేనే మాట్లాడతాడు అంటారు . ఇది నిజామే నంటారు సురేష్ బాబును దగ్గరగా చూసినవారు .
చిన్న నిర్మాతలు సినిమాలు తీయడమే కష్టం , ఒకవేళ తీసి విడుదల చేసుకోవడం అసాధ్యం . కారణం సురేష్ బాబు , సునీల్ నారంగ్ లాంటి వారి చేతుల్లో థియేటర్లు ఉండటమే. . ధైర్యం చేసి విడుదల చేసినా చేతికి రూపాయి వస్తుందన్న గ్యారంటీ లేదు . అందుకే చాలా మంది చిన్న నిర్మాతలు తమ సినిమాలను ముందుగా సురేష్ బాబుకు చూపెడతారు . అది బాగా లేకపోతె మాత్రం విడుదల చెయ్య వద్దంటాడు . ఒక మోస్తారుగా ఉంటే స్వంతంగా విడుదల చేసుకొమ్మని సలహా ఇస్తాడు . ఈ సినిమా నచ్చితే మాత్రం , నిర్మాణానికి ఎంత అయ్యిందో కనుక్కుంటాడు . స్వంతంగా విడుదల చేసుకుంటే ఎంత ప్రమాదమో వివరిస్తాడు . దయతో వారు భయపడి ఎదో ఒక రేటుకు మీరే తీసుకోండి అని ప్రాధేయ పడతారు . అప్పుడు సురేష్ బాబు నిర్మాణ వ్యయం మీద కొంత ఎక్కువ ఇచ్చి హక్కులన్నీ తీసుకొని విడుదల చేస్తాడు . అంటే కష్ట పడకుండా డబ్బు సంపాదించడం సురేష్ బాబుకు బాగా తెలుసు .
ఇటీవల పరుచూరి ప్రవీణ అనే అమ్మాయి అమెరికా నుంచి వచ్చి మహా వెంకట్ ఆటే దర్శకుడుతో కేరాఫ్ కంచర పాలెం అనే సినిమా స్థానిక కళాకారులతో నిర్మించింది . ఈ సినిమాకు 42 లక్షలు అయ్యిందని తెలిసింది . ఈ సినిమా చూసిన సురేష్ బాబు మరో 42 లక్షలు లాభం ఇచ్చి హక్కులు తీసుకున్నాడట . ఇప్పుడు ఈ సినిమా ప్రదర్శన మీద, శాటిలైట్ మీద కల్సి 5 కోట్ల వరకు రావచ్చు నని తెలిసింది .
కష్టం ఒకరిది ఫలితం మరొకరిది అంటే ఇదేనేమో ..!