హాలీవుడ్‌లో మెదలైన మీటూ ఉద్యమం బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలకు పాకింది. హీరోలు, దర్శకులు, టెక్నీషియన్స్ వలన ఇబ్బంది పడ్డ భామలు డైరెక్ట్‌గా మీడియా ముందుకు వచ్చి నిజనిజలాను బయటపెడుతున్నారు. ముఖ్యంగా మన సౌత్ ఇండస్ట్రీ విషయానికి ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్నయి మీటూ ఉద్యమంపై గట్టి పోరాటం చేసింది. తనని వేధించిన వారి పేర్లు బయటపెట్టి కఠిన శిక్షలు పడాలని డిమాండ్స్ చేసింది.
తాజగా అమీర్ ఖాన్ స్పోర్ట్స్ డ్రామా దంగల్‌లో నటించిన ఫాతిమా సనా షేక్ లైంగిక వేధింపుల గురించి బాహటంగా చెప్పుకొచ్చింది. బాల్యంలోనే కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు కొద్ది రోజులుగా సహా నటి సన్య మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికారు చేశాయి. దీనిని ఖఃడించిన ఫాతిమా జీవితంలో జరిగిన విషాద ఘటనలను జాతీయ మీడియాకు చెప్పుకొచ్చింది. లైంగిక వేధింపుల చుట్టూ ఓ కళంకం ఉంది. దీని వలననే మహిళలు దాని నుండి బయటకు రాలేకపోతున్నారు.
చదువుకోవడం వలన లైంగిక వేధింపులపై ప్రజలలో అవగాహన పెరుగుతుంది. దీనిపై అందరు కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు నేను ఈ విషయంపై గురించి మాట్లాడకపోవడానికి కారణం ఇదే అంటూ ఫాతిమా సనా చెప్పుకొచ్చింది. సెక్స్ చేస్తేనే ఉద్యోగం వస్తుందని గతంలో నాతో చాలా మంది అన్నారు. కాని దీనికి నేను ఏ నాడు ఓకే చెప్పలేదు. ఇలా ఉండడం వలన అనేక ప్రాజెక్ట్‌లు కూడా మిస్ అయ్యాను అంటూ తన జీవితంలో ఎదురైన అనుభవాలని వివరించింది ఫాతిమా. ప్రస్తుతం ఈ అమ్మడు లుడో, సూరజ్ పే మంగల్ భరీ చిత్రాలలో నటిస్తున్నారు.