కంగనా కారు పై దాడి చేసిన రైతులు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి రైతులు సాగు చట్టాల కోసం ధర్నా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను ఉగ్రవాదులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే కొందరు పంజాబ్ కి చెందిన ఒక వ్యక్తి తనని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఈమె పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం కూడా తెలిసిందే. ఇలా నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ కారు పై కొందరు రైతులు రాళ్ల దాడి చేసినట్లు ఆమె వెల్లడించారు. కంగనా హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్‌లోకి ఎంటరైన సమయంలో.. బుంగా సాహిబ్ వద్దకు రాగానే కొందరు రైతులు ఆమె కారును అడ్డగించారని తెలిపారు.

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ధర్నాలు రైతులను ఉగ్రవాదులు అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహించిన రైతులు ఈమె రైతులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇలా తన కారు పంజాబ్ లోకి ఎంటర్ కాగానే కొందరు వచ్చి తన కారుని చుట్టుముట్టి పెద్ద ఎత్తున గొడవ చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కొందరు తన కారుపై దాడి చేశారని కంగనా వివరించారు. కంగనా తన సోదరి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుని మనాలి నుంచి పంజాబ్ కు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.