మాకొద్దీ అప్డేట్స్.! ప్రభాస్ అభిమానుల గుస్సా.!

ఏ హీరో అభిమానులైనా తమ అభిమాన నటుడి సినిమాపై అసహనం వ్యక్తం చేయగలరా.? అదీ సినిమా విడుదల కాకుండానే.! అప్డేట్స్ రాకపోతే అసహనం వ్యక్తం చేయొచ్చు. అప్డేట్స్ వస్తేనే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ విషయంలోనే ఇలా జరుగుతోందేమో.! ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌ని ప్రభాస్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ -కె’ లాంటి సినిమాలు పెట్టుకుని, మారుతి దర్శకత్వంలో సినిమా ఏంటి.? అని ప్రభాస్‌ని అతని అభిమానులే ప్రశ్నిస్తున్నారు.

కానీ, ప్రభాస్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్. మాళవిక – ప్రభాస్ మధ్య సన్నివేశాల షూటింగ్ షురూ అవబోతోందన్నది తాజా అప్డేట్. ‘ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. సినిమా ఆపెయ్..’ అంటూ ప్రభాస్‌కి అతని అభిమానులే అల్టిమేటం ఇస్తున్నారు. ఇప్పుడే ఇలా వుంటే, అసలు సినిమాని థియేటర్లలో రిలీజ్ అవనిస్తారా.? అయినా, హీరోల్ని అభిమానులు శాసించడమేంటో.!