రాధే శ్యామ్ టీజర్ కోసం అభిమానుల ఆత్రుత.. కొన్నాళ్ళ నిరీక్ష‌ణ త‌ప్ప‌దా..?

ఇండస్ట్రీలో కొంతమంది స్టార్స్ అంటే ప్రేక్షకులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ స్టార్ సినిమా వస్తుందన్నా.. ఆ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, ఎలాంటి అప్డేట్స్ కోసమైనా ఎంతగానో ఎదురుచూస్తారు. అదేవిధంగా స్టార్స్ కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు డైరెక్ట్ గా తమ సినిమా అప్డేట్స్ అందిస్తుంటారు. అలాంటి స్టార్ డమ్ ఉన్న యాక్టర్స్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది ఫిల్మ్ టీమ్. ఈ సినిమాని డైరెక్టర్ రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ది మోస్ట్ అవైటెడ్ టీజర్ గా ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా టీజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ ఈ టీజర్ ను ఫిల్మ్ టీమ్ ఫైనల్ చేయలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశపడ్డారు.

అయితే ఈ సినిమా టీజర్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్లే చెబుతున్నాయి సినీ వర్గాలు. మరీ ఎంతో మంది ఆత్రుతగా ఎదురు చూసే రాధే శ్యామ్ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుందనే తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో పాటు యూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.